ఇల్లు > కవితలు (నా కలల కొలువు) > సహనమే సాహసించనంతగా, ఎదురుచూసా

సహనమే సాహసించనంతగా, ఎదురుచూసా

సహనమే సాహసించనంతగా, ఎదురుచూసా
గగనమే గాలిస్తూ వెతకసాగా…
చివరికి కన్నీటి ఆవిరిలో, పన్నీటి చేదుతో
వలపు పాసమై చుట్టుకున్న బతుకు జాలములో మిగిలిపోయా….
ఉన్నాడా దేవుడు, బతికున్నాడా దేవుడు
భక్తి, యుక్తి తో కలగని తృప్తి
కుయుక్తి తో కలుగునా
శక్తి ధారపోసి నెరవేర్చుకున్న కలలు
మన్నులో కలిసిపోవునా

  1. koutilya
    2:27 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 20, 2011 | #1

    ఏంటబ్బాయ్! ఇంత కసితో రాశావ్…..

  2. 12:17 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 22, 2011 | #2

    ఆత్మజ్ఞానము నిలో ఎంతవరకు సఫలమైనదో గ్రహించనెంచి ప్రశ్నించినపుడు సమాధానము: నీకిక చెప్పవలసినది ఇంకేమియును లేదనెను.జీవుడు దేవునికి వేరుగ బయట ఉండుటకు వీలులేదని బోధించెను. శరీరం, ప్రపంచం, భగవంతుడు సర్వాత్మనుండి ఉద్భవించి అందే లయించుచున్నవి. నేను అనగా శరీర ధ్యాస వచ్చినచో నీవు వేరు, భగవంతుడు వేరు. ఆత్మ జ్ఞానంతో అతడే నీవు. చూచేవాణ్ణి చూడ నేర్వాలి. అప్పుడు సమస్యలన్ని మాయమగును. నాది అన్నపుడు నీవు, శరీరం వేరే అవుతుంది. అలాగే నా శరీరం అన్నపుడు నీవు శరీరం కాదు. నీవు వేరే, శరీరం వేరేయని అర్ధం. నా ఇల్లు అన్నపుడు నేను ఇల్లుకాదు. ఇల్లు నాకు వేరుగ యున్నది. అట్టి నీలో వైకుంఠం, కైలాసం, స్వర్గం, ముక్తి, మోక్షం, బ్రహ్మ, వైకుంఠపురం నీలోనిదే.చూచే నేనును చూచేవారు ధన్యులు. నేనును (శరీరం) చూస్తూ అసలు ‘నేను’ను విస్మరించరాదు. శరీర భ్రాంతిని వీడి నా ‘నేను’లోమనస్సు నిలువాలి. సర్వమత సంబంధ, సమస్త జ్ఞానబోధల సారం ఇందే ఇమిడియున్నది. ఆధ్యాత్మిక జీవనమును కోరక తప్పదు. ప్రతి జీవి ఘనీభ వించిన మోక్ష స్వరూపమే. కాల పరిపాకమున ప్రతి పిందె కాయగ, పండుగ మారగలదు. పామర చిత్తులే పూత. ఫరిపక్వ హృదయులే ఫలములు. లేవండి! అలౌకిక దైవరాజ్యమును వెదకండి. అది బయట లేదు. మీలోనేగలదు. ఆత్మ విశ్వాసులై అఖండ దైవ సామ్రాజ్యమును మీలోనే స్వస్వరూపముగ దర్శించనేర్వండి.సకల చరాచర జీవ సమూహమును, తరులు, గిరులు, నరులు, అనే తార తమ్యం లోకుండా సమస్త ప్రవక్తలను, సమస్త గురువులను, బోధకులను, సమస్త పీఠాధిపతులను, , మాతలను, సమస్త దైవావ తారముల ఏకావస్ధలో, ఏకాత్మస్ధితిలో నిలిపి గాంచినపుడే నీ నిజస్వరూ పం బట్టబయలుగ గ్రాహ్యమై అనుభూతి కాగలదు. మనసు చైతన్యమై, పరిపూర్ణమైన బ్రహ్మానుభూతిని చవిచూస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ. పరిశుద్ధ మానసమే పరమాత్మ స్వరూపం. ఈ దశలో మనసు బ్రహ్మాకారం గ వర్ధిల్లుతుంది. జాగ్రదావస్ధలో సుషుప్తి అనుభవమే సమాధి. నేను అనే మనసు మూలంలో అణగిపోయినపుడు ఎంతకాలమైనా ఆత్మయొక్క అవిచ్చిన్న పరిపూర్ణ ఆనందమును అనుభవించవచ్చు

  3. rathnamsjcc
    3:07 అపరాహ్నం వద్ద మే 5, 2011 | #3

    మానవ జీవితంపై గురువు ప్రభావం
    నిన్ను నీవు తెలుసుకోకుండా. జ్ఞాన0
    . గురువును సేవిస్తే సకల దేవతలనూ సేవించిన ఫలితం వస్తుంది.
    గురువులు చెప్పింది నీన్ను. నీవు తెలుసుకోవడమే ఆసలెన జ్ఞాన0• గురువు ద్వారానే తాను పరమాత్మస్వరూపమని తెలుసుకొని, తన్ను తాను తెలుసుకోవటమే పరమ ధర్మం జ్ఞాన0 ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి తెలుసుకోవడమే ప్రపంచమంతా మాయలతో నిండి ఉన్నది. అందులో నుంచి బయటపడి మాయాతీత స్థితిని సాధించాలంటే ముందుగా మహనీయులలో జ్ఞాన మార్గమే ఆత్మ స్థితికి దారి తీయగలదని ఉద్బోధించిన ఆత్మ సత్యం ఒక్కటే అన్న విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకో • మనసు పునీతం దైవం అంటే మరేదో కాదు, నీలో నిక్షిప్తమైన దైవ భావన, దేవుని ఆరాధన అంటే కేవలం దేవాలయాల్లో దైవాన్ని పూజించటమే కాదు, తన్ను తాను పూజించటమే• ఆధ్యాత్మిక జీవనం అంటే లౌకిక జీవనంలోని అవకతవకలను విడనాడి దేవుడు, జీవుడు వీరి అనుబంధం సక్రమంగా అర్థం చేసుకోవడమే.అయితే నేడు ఆధ్యాత్మికత అర్థం మారిపోయింది. గుళ్లు గోపురాలు దర్శించి, చెప్పింది వినటం మాత్రమే ఆధ్యాత్మికత అని భావిస్తున్నారు. దీన్ని అలుసుగా తీసుకొని అమాయక భక్తులను మోసగించే అనైతిక గురువులు స్వాములు కూడా బయలుదేరినారు.వీరు ఆధ్యాత్మికత ముసుగులో ఎన్నో దురాచారాలు చేసి, మన వేలుతో మన కన్ను పొడుస్తున్నారు. గురువులు
    గురువు జ్ఞాని అయినవరు. మాత్రమే నిజమైన కర్మయోగి కాగలడు.నిష్కామ కర్మమ భోదించిన ఇక్కడ కర్మ చేయడమా చేయకపోవడమా అనేది ముఖ్యం కాదు.కర్మ చేస్తున్నదెవరు అని నిరంతరం ప్రశ్నించుకోవాలి.కర్మ చేస్తున్నప్పుడు నేను కర్తను అనే భావనతో చేస్తే కర్మ ఫలితాలను తప్పక
    అనుభవించి తీరాలి.చేసే కర్తను నేను కాదు,ఒక దివ్యచైతన్యం సూక్ష్మ శక్తి తనరూపకంగా ఆపని చేయిస్తున్నదని స్వయంగా తెలుసుకున్నప్పుడు ,జ్ఞాని ఎంతటి కర్మ తనద్వార జరుగుతున్న నిశ్చలంగా ఉంటాడు. జ్ఞానం కలవాడే నిజమైన .కర్మ ఫలితాలు అతనిని తాకనైనా తాకలేవు. అతని హృదయంలో ఎల్లప్పుడూ నివసించేవాడు జ్ఞాని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు అతడు ఎంతో భక్తితో అతిథిని సేవించి సేద తీర్చేవాడు. పరమానందాన్ని కలిగించింది. కాని ధీరులు సర్వకాల సర్వావస్థలయందు తమ స్వాభావిక సద్గుణాలను విడిచిపెట్టరు.

  4. srinivas
    8:31 అపరాహ్నం వద్ద డిసెంబరు 29, 2011 | #4

    meeru chaalaa gnaanni sampaadinchaarani naa abhipraayam…

  5. 2:00 పూర్వాహ్నం వద్ద డిసెంబరు 30, 2011 | #5

    mare, marrichettanta gyananam….abbaa bharinchalekunna ee bharam :P

  1. No trackbacks yet.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.