నిల్వలు

Archive for సెప్టెంబర్, 2010

బ్రతుకెందుకు, బతికేందుకు….

సెప్టెంబర్ 30, 2010 వ్యాఖ్యానించండి

ఎన్నో ఆశలు, ఇంకెన్నో ఆలోచనలు,
అస్సల మనిషి మనుగడ ఇవి లేకుండా సాగుతుందా?
సాగలేదు కదా!
కానీ కన్న ప్రతి కళ, కళ్ళ ముందే కన్నీరులా మారిపోతుంటే
దుఃఖ సముద్రాలా సాగరం లోకి అలుపెరగని నదిలా అశ్రువులు జారిపోతుంటే
ఆవెదనపు మేఘాల హారం లో ఏ మబ్బుకి ఏ చినుకు చెందుతుందో తెలియనంతగా, జడివానలా కన్నీరు కారిపోతుంటే
ఆవేశం, ఆలోచన ఉన్న మనిషేవరన్న ముందుకి సాగాలనుకుంటాడా?
సాగలేడు కదా!
కానీ ఇది కాదు జవాబు. సాగాలని కోరుకోడు. ఇది జవాబు.
జీవితం లో బతకాలా, చావాలా అనుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. అందులో, ఈ బ్లాగ్ లో నేను అపుడప్పుడు రాసే సొల్లు చదివే, నా నేస్తం ఒకడు.
మిత్రమా, నీకు నేను చెప్పేది ఒకటే……..
బతకలేకపోవడం వేరు, బతకాలని లేకపోవడం వేరు.
నువ్వు కేవలం బతకాలనుకోవట్లేదు అంతే. అది జస్ట్ మన మైండ్ లోని సవాలక్ష ఆలోచనల్లో ఒక చెత్తది.
matrix లో చెప్పినట్టు మన మైండ్ లో temporary గా నిజమనుకుంటూ store చేసుకున్న ఒక బుజ్జి electrical impulse మాత్రమె.
ఐన ఒకటి చెప్పు, జీవితం లో ఎన్నో మంచి చెడులను చూసే ఏ మనిషైన ఆనందాన్ని తట్టుకోలేకపోవడం అనేది జరుగుతుందా…
మరి బాధనేందుకు తట్టుకోలేను అనాలి రా నువ్వు.
జీవితం ఇచ్చే ఆనందాలను నవ్వుతు స్వీకరించే మనం బాధను కాదంటే ఎలా.
కావాలంటే కాస్త కన్నీటితో కష్టాలను కడిగేయాలి, తరిమేయాలి….అంతే గాని జీవితాన్ని కాదు కదా.
నిన్ను కలుసుకునే మార్గం ఇంకేమి లేక ఈ బ్లాగ్ ద్వారానే నిన్ను చేరుకుందామని నా ఈ ప్రయత్నం
మన్నించగలవు.
బ్రతుకెందుకు, బతికేందుకు….

వర్గాలుGeneral