నిల్వలు

Posts Tagged ‘కవితలు’

సహనమే సాహసించనంతగా, ఎదురుచూసా

ఫిబ్రవరి 20, 2011 5 వ్యాఖ్యలు

సహనమే సాహసించనంతగా, ఎదురుచూసా
గగనమే గాలిస్తూ వెతకసాగా…
చివరికి కన్నీటి ఆవిరిలో, పన్నీటి చేదుతో
వలపు పాసమై చుట్టుకున్న బతుకు జాలములో మిగిలిపోయా….
ఉన్నాడా దేవుడు, బతికున్నాడా దేవుడు
భక్తి, యుక్తి తో కలగని తృప్తి
కుయుక్తి తో కలుగునా
శక్తి ధారపోసి నెరవేర్చుకున్న కలలు
మన్నులో కలిసిపోవునా

లేదు నాకు గమ్యం

మార్చి 5, 2010 11 వ్యాఖ్యలు

లేదు నాకు గమ్యం నాటి వరకు….
ఆశ అంతకన్నా లేదు ఆనాటి వరకు
కానరాలేదు దేవుడు నాటి వరకు
ఆయన సృష్టించిన స్వర్గం ఆనాటి వరకు
కాని నిన్ను చుసిన తరుణం నుంచి…
ఆశ నా యెదలో, నువ్వు నా మది లో, స్వర్గం నీ సడిలో
అందుకే, నా ఆశ, నా ఊపిరి, నా ఆలోచన,
అన్ని నీకే అంకితం ఓ నా ప్రాణమా…

స్వర్గం…

మార్చి 5, 2010 2 వ్యాఖ్యలు

నువ్వు దూరమైతే దూరమైంది కేవలం ఆనందం. నీ మీద ప్రేమ కాదు. అదే నువ్వు పక్కన ఉంటె……

స్వర్గం, నిన్ను చుసిన నా ఈ కళ్ళలో,

స్వర్గం, నీ ఛాయను అంటి ఉన్న ఈ నెలలో,

స్వర్గం, నీ తోడు లోనీ ఈ సఖ్యము లో,

స్వర్గం, నన్ను నేను చూసుకుంటున్న నీలో

దూరం…

మార్చి 4, 2010 2 వ్యాఖ్యలు

దూరం, ఎగిసిపడే ఆనందం

దూరం, చెరగని చిరునవ్వు

దూరం, ఆగని సంతోషం

దూరం, చెదరని సంతృప్తి

ఇన్ని దూరమైనా ఎందుకో దూరంకాలేదు ప్రేమ

కనులలొ, కన్నీటి అడుగులో

ఫిబ్రవరి 12, 2009 5 వ్యాఖ్యలు

కనులలొ, కన్నీటితో ముందుకు సాగె ప్రతీ అడుగులొ
గుండెలొ, గుర్తున్న ప్రతీ గ్యాపకములొ
నువ్వుండి పొయావు…
గుర్తుండి పోయావు…


నా తొడు నిలిచినది, నా మనసు కదిపినది
ప్రెమేదొ పుట్టించి, నన్నిలా వదిలినది
ఎందుకొ…


నయనాలు నీకొసమై, పాదలు నీవైపుకై
నన్నిలా వదిలినా, ఆగనంటున్నాయి నా
భావాలు …


అధరాల నుండి, జాలువరె వచనాలు
నయనాలు నుండి, నేలకై జారె కన్నీటి ధారలు
ఎన్ని చూపమంటావు, ఈ ప్రెమ ఆనవాల్లు


కనులలొ, కన్నీటితో ముందుకు సాగె ప్రతీ అడుగులొ
గుండెలొ, గుర్తున్న ప్రతి గ్యాపకములొ
నువ్వుండి పొయావు…
గుర్తుండి పోయావు…

ప్రేమ గాధ

డిసెంబర్ 17, 2008 2 వ్యాఖ్యలు

కాన రాని దూరానా కనిపించింది

కాసింతలోనే, కడ దాక కలిసివస్తానంది

కలయా నిజమా, అనె ఆలొచనలొ కల్లుమూసుకున్నాను

కాని కళ్లు తెరిచి చుసేసరికి కనుమరుగైపోయింది

కూసంత ఈ గాధ, కొండంత బాధ లా మారి, కన్నీటి వర్షాన్ని కురిపిస్తుండగా

దారెది కానరాక, గడి ఏది గడపకుండ,నా జీవనము పయనిస్తూ ఉంది