నిల్వలు

Posts Tagged ‘telugu kavitalu’

కాలమేదైనా…

కాలమేదైనా, నే రాసే ప్రతి కావ్యము నీదే
  యుగాములేన్నునా, నే గడిపే ప్రతి క్షణములు నివే


తెరిచి చూసే నా కళ్ళు, నీకై వెతకగా
మెరిసిపోయే నువ్వు దాగగలవా
వలచిన నన్ను విడిచి ఉండగలవా

ninnu chudaka mundu…

నిన్ను చూడక ముందు గడిపిన కాలం, కాలమే కాదు

నిన్ను చూడకుండా గడుపుతున్న ఈ సమయం, సమయమే కాదు

నువ్వూలేకుండా ఆనందంగా గడపగలిగితే ఆది నేను కానే కాను

అప్పటిదాకా నా జీవితం


అప్పటిదాకా నా జీవితం, ఒక తెల్ల కాగితం
ఆమెను చూడగానే రాశాను అందులో ఒక అక్షరం
అక్షరం, ఆమె పరిచయముతో ఆయ్యంది ఒక పదం
ఆమె స్నేహం తో పూర్తైంది ఒక వాక్యం
ప్రేమతో వాక్యం కాస్త అయ్యేను, కావ్యం
ఆ కావ్యంలోనే దాగెను నా జీవితం


అంతమొద్దు ఈ కధకి, ఆదిలోనే, బాగుంది అంటూ.
కన్నాను కళలు, కావాలనుకొని తనను………….

ఎక్కడది స్వేచ్ఛ, ఎక్కడ మిగిలింది అపేక్ష

ఫిబ్రవరి 22, 2009 5 వ్యాఖ్యలు

ఎక్కడది స్వేచ్ఛ, ఎక్కడ మిగిలింది అపేక్ష

మంచి ఉన్న ఈ లోకం లో, మంచన్నదే అప్పుడప్పుడు  కాన  రాదే

అన్నమున్న ఈ  దేశములో, ఎందరికి ఆకలి కలగదాయే

బాధలున్నా వాడికి చెప్పెను లోకం

రేపు వచ్చినపుడు తెచ్చును  సంతోషం

ఎప్పుడో వచ్చు సంతోషం కోసం వేచి చూసేను అతను పాపం

కానీ ఇప్పుడెందుకు అతనిపై దేవునికింత కోపం?

ఇది తలరాతా లేక, అతని పోరబాటా

తెలిసిన వారు చెప్పరేం? తెలియని వారు అడుగరేం?

పర జన్మ పాపాల ఫలము పొందేనా ఈ జన్మ లో

లేక ఈ జన్మ పాపాలే మింగేనా అతనిని ఈ లోకం లో

ఎక్కడది స్వేచ్ఛ, ఎక్కడ మిగిలింది అపేక్ష

అక్కడక్కడ ఆనందం

అందుకోసమై అందరి పోరాటం

ఎందరికి దక్కున ఈ భాగ్యం

అందులో ఎందరు పంచెను కొంచం

ఏమీ లేని ఒకరికి ఆకలి,

అన్నీ ఉన్నా మరొకరికి ఆవేదన

చుట్టూ, అందరికి ఎన్ని ఉన్నా

ఎందుకో తెలియదు ఈ మనోహేళన

తీరని ఆశలు ఎందుకు కలిగెను కలలలో

కోరిన కోరికలు ఎందుకు నెరవేరెను కేవలం అందులో

మరి ఎక్కడది స్వేచ్ఛ, ఎక్కడ మిగిలింది అపేక్ష

తోడూ నువ్వు లేని ఈ క్షణము

ఫిబ్రవరి 15, 2009 9 వ్యాఖ్యలు


తోడు నువ్వు లేని ఈ క్షణము
గడపనన్నది నా ప్రాణము


నిన్ను చేరలేని ఈ పయనము
ఎందుకన్నది నా హృదయము


కాలము నువ్వై, కలిసి రావా నాతో
స్నేహము నువ్వై, ఉండిపోవా యెదలో

కనులలొ, కన్నీటి అడుగులో

ఫిబ్రవరి 12, 2009 5 వ్యాఖ్యలు

కనులలొ, కన్నీటితో ముందుకు సాగె ప్రతీ అడుగులొ
గుండెలొ, గుర్తున్న ప్రతీ గ్యాపకములొ
నువ్వుండి పొయావు…
గుర్తుండి పోయావు…


నా తొడు నిలిచినది, నా మనసు కదిపినది
ప్రెమేదొ పుట్టించి, నన్నిలా వదిలినది
ఎందుకొ…


నయనాలు నీకొసమై, పాదలు నీవైపుకై
నన్నిలా వదిలినా, ఆగనంటున్నాయి నా
భావాలు …


అధరాల నుండి, జాలువరె వచనాలు
నయనాలు నుండి, నేలకై జారె కన్నీటి ధారలు
ఎన్ని చూపమంటావు, ఈ ప్రెమ ఆనవాల్లు


కనులలొ, కన్నీటితో ముందుకు సాగె ప్రతీ అడుగులొ
గుండెలొ, గుర్తున్న ప్రతి గ్యాపకములొ
నువ్వుండి పొయావు…
గుర్తుండి పోయావు…